*****గుండ్లకమ్మ సామాజిక రాజకీయ మాపత్రిక ప్రారంభించి 10 వసంతాలు పూర్తయిన శుభసందర్భంగా శుభాకాంక్షలు******            పద్యం  పుట్టిన గడ్డ అద్దంకి  నుండి  వెలువడుతున్న"గుండ్లకమ్మ"  పత్రికకు  స్వాగతం  ...సుస్వాగతం....              పత్రికారంగంలో  ఒక వినూత్న  ఒరవడికి శ్రీకారం చుడుతున్న "గుండ్లకమ్మ" వెబ్ సైట్ ప్రారంభం  సందర్బంగా ఇవే మా శుభాకాంక్షలు....
Untitled Document
About Us

" గుండ్లకమ్మ " వెబ్ సైట్ లోకి మీరు ప్రవేశించినందుకు , తెలుగులో మంచి పత్రిక తేవాలన్న నా సంకల్పానికి చేయూతనిస్తున్నందుకు వెలుగులు పంచే ఈ దీపానికి ఏగాలి తాకిడి సోకకుండా అరచేయి అడ్డుపెడుతున్నందుకు , ' గుండ్లకమ్మ ' మాస పత్రికను పది సంవత్సరాల పాటు ఆదరించి , ఆర్ధికంగానూ, హార్ధికంగాను పోషిస్తున్నందుకు మరోసారి ధన్యవాదములు.

నాటి సత్యదూత , వర్తమాన తరంగిణి , తత్వభొదిని, వివేకవర్ధిని మొదలు నేడు మనం చూస్తున్న సామాజిక , రాజకీయ , సాంస్కృతిక పత్రికల వరకూ మాస, పక్ష, వార, దిన పత్రికలలో ఏదైనా సరే పల్లె ప్రాంతాల నుండి వచ్చే పత్రిక కనిపించడంలేదు . ఆ నేపద్యంలో పేరులోనూ , ప్రాధాన్యతలోనూ , పల్లె పట్టుకు ప్రధానస్థానం ఇస్తూ గ్రామీణ ప్రాంతం నుండి ప్రారంభమయ్యే పత్రిక " గుండ్లకమ్మ ".

రాజకీయ, సాంస్కృతిక, వైజ్ఞానిక, కళాత్మక చైతన్యాన్ని కాడిపట్టిన ఇంట ప్రతిష్టించడమే లక్ష్యంగా " గుండ్లకమ్మ " అడుగులువేస్తుంది. గుండ్లబ్రహ్మేశ్వరం నుండి గుండాయపాలెం వరకూ లక్షలాది ప్రజానీకం అవసరాలను తీరుస్తూ పవిత్ర నదిగా పేరుపొందిన " గుండ్లకమ్మ" పేరుతో ఈ పత్రికను తీసుకొన్నందుకు సంతోషంగా వుంది.

ఈ పత్రిక విజయవంతం కావడమంటే మంచి విషయాలను అందిచటమే కాదు, పది కాలాలు మనుగడ సాగించటం  కూడా.....

పత్రిక నిర్వహణ తలకుమించిన భారమైనప్పటికీ, పత్రికా రంగంలో నాకున్న రెండు దశాబ్ధాల అనుభవాన్ని పెద్దలు నాకిస్తున్న ప్రొత్సాహాన్ని, సంస్థలు ఇస్తున్న ఆదరణ వెచ్చించి అవిశ్రాంతంగా కష్టపడి పత్రికను నిరాఘాటంగా తెచ్చేందుకు కృషిచేస్తున్నాను.

చారిత్రక రాజదాని అద్దంకి నుండి వెలువడే "గుండ్లకమ్మ" ను ఈనాడు పోటా పోటీ గా వస్తున్న సామాజిక, రాజకీయ సాంస్కృతిక పత్రికల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆదరించే నా ప్రాంత ప్రజానీకానికి నేనెపుడూ రుణపడి వుంటాను.

గత పది సంవత్సరాలుగా "గుండ్లకమ్మ" పత్రిక స్తానిక, రాష్ట్రీయ,జాతీయ ,అంతర్జాతీయ వార్తలు ,కవితలు కధానికలు,మానవీయ కధనాలు ఇంకా...ఇంకా..అనేక రూపాల్లో మీ ముందు ఆవిష్కరించబడింది. రసజ్ఞులైన పెద్దలు ఆనందించి అభినందించారు. రచయితలు సహకరించారు,చేయూతనిచ్చారు.

"గుండ్లకమ్మ"లో అందంగా ముద్రించబడుతున్న ప్రకటనకు వ్యాపార వేత్తలు,రాజకీయ నాయకులు,దేవాలయ ధర్మకర్తలు ,చారిటబుల్స్ అధి నేతలు కళాశాలల అధినేతలు ఇంకా ఎందరెందరో వదాన్యులు ముచ్చట పడ్డారు.మళ్ళీ మళ్ళీ ప్రకటనలు ఇచ్చారు కొండంత ఊపిరి పోశారు.

సర్క్యులేషన్ పెరిగింది. సహృదయం వెన్నుతట్టు పెరిగింది అంతో ఇంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అన్నీ ఇలాగే వుంటే మీ అందరూ ఆశీర్వదిస్తే పత్రిక ఇంకా అదనంగా రూపుదిద్దుకోని మీ చేతుల్లో చిరకాలం నిలుస్తుంది.

పాఠకులు, ప్రకటనకర్తలు నా శ్రమని గుర్తించి పత్రికను ఆదరించటమే కాకుండా ఎప్పటికప్పుడు అభిప్రాయాలను అందజేస్తూ ' గుండ్లకమ్మ ' ను అందంగా, ఆకర్షణీయంగా , విలువైన సమాచారంతో అవిరామంగా ముందుకు సాగటానికి సహకరించి ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటూ...


మీ,
సందిరెడ్డి కొండలరావు
ఎడిటర్ :